వాలంటైన్స్ డే కి సరికొత్త అర్దాన్ని ఇచ్చిన ఉపాసన
on Feb 14, 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఆయన అభిమానులు ఎంతగా ఆరాధిస్తారో ఆయన ఫ్యామిలీ ని కూడా అంతే ఇదిగా ఆరాధిస్తారు. ఆయన ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఆనందాన్ని అయినా వాళ్ళు తమ ఆనందంగా భావిస్తారు.అలాంటిది ప్రేమకి పవిత్రమైన రోజుగా భావించే వాలంటైన్స్ డే రోజున ఒక పిక్ వస్తే ఇంక అభిమానులకి అంతకు మించిన మధురమైన రోజు ఉంటుందా!
చరణ్ వైఫ్ ఉపాసన వాలంటైన్స్ డే సందర్భంగా ట్విట్టర్ లో చరణ్ అండ్ క్లీంకార ల కి చెందిన ఒక పిక్ ని షేర్ చేసింది. ఆ పిక్ లో చరణ్ అండ్ క్లీంకార లు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఉన్నారు. ఉపాసన ఆ పిక్ కి చరణ్ క్లీంకార ల బంధం ఎప్పటికి నిలిచిపోతుందని అర్ధం వచ్చేలా కొన్ని ఈమోజీలనీ కూడా పంచుకుంది.ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాని ఒక కుదుపు కుదుపుతుంది. తను అలా షేర్ చేసిందో లేదో మెగా ఫ్యాన్స్ అందరు ఆ మధురమైన పిక్ ని చూసి మురిసిపోతున్నారు. అలాగే చరణ్ క్లీంకారల బంధం ఎప్పటికి నిలిచిపోతుందని అర్ధం వచ్చేలా కామెంట్స్ కూడా చేస్తున్నారు. పనిలో పనిగా ఉపాసన చెర్రీ లకి వాలంటైన్స్ డే శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు.
అలాగే ఇప్పుడు ఆ పిక్ సొసైటీ లో ఒక కొత్త ట్రెండ్ ని కూడా క్రియేట్ చేస్తుంది. ప్రేమ అనేది ఎంతో పవిత్రమైనదని ఆ ప్రేమ యొక్క రూపాలు చాలా గొప్పవని ఒక తండ్రి కూతురు మధ్య ఉండే ప్రేమ కన్నా గొప్పది ఏమి ఉండదని చెప్పినట్టయింది.అలాగే వాలంటైన్స్ డే తండ్రి కూతురు ప్రేమకి చిహ్నం అని కూడా చెప్పినట్టయింది.
Also Read